శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 అక్టోబరు 2023 (15:58 IST)

భగవంతుడి ఆశీస్సుల వల్లే నారీపూజ పాల్గొనే అవకాశం లభించింది : సినీ నటి ఖుష్బూ

naripuja
ఆ భగవంతుడి ఆశీస్సుల వల్లే తనకు నారీ పూజలో పాల్గొనే అవకాశం లభించిందని సినీ నటి ఖుష్బూ అన్నారు. కేరళలోని ఓ ప్రముఖ దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో ఆమె పాల్గొన్నారు. ప్రతి యేటా ఒక్కసారి మాత్రమే నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగం కావడం తనకు ఆనందంగా ఉందంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
 
త్రిసూర్‌లోని ప్రాచీన విష్ణుమాయ దేవాలయంలో ఏటా ఒకసారి నారీపూజ నిర్వహిస్తుంటారు. దీనిలో పాల్గొనే మహిళను ఆ భగవంతుడే ఎంచుకుంటారన్నది అక్కడి వారి విశ్వాసం. ఈ ఏడాది పూజలో పాల్గొనే అవకాశం నటి ఖుష్బూకు లభించింది. దీంతో ఇటీవల ఆమె విష్ణుమాయ దేవాలయంలో నిర్వహించిన నారీ పూజలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన విశేషాలను తాజాగా ఆమె నెటిజన్లతో పంచుకున్నారు.
 
'ఆ భగవంతుడి విశేష ఆశీస్సులు పొందాను. నారీపూజలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా. కేవలం ప్రత్యేక ఆహ్వానితులకు మాత్రమే ఇందులో పాల్గొనే అవకాశం లభిస్తుంది. పూజలో పాల్గొనే వ్యక్తిని సాక్షాత్తూ ఆ భగవంతుడే ఎంచుకుంటారన్నది అక్కడి వారి విశ్వాసం. మనందరికీ ఆ భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతున్నా. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ సంతోషం, శాంతితో జీవించాలని కోరుకున్నా" అని ఆమె తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.