సోమవారం, 4 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 అక్టోబరు 2021 (18:20 IST)

బుల్లెట్ బండి పాట సరికొత్త రికార్డు- ఏకంగా వంద మిలియన్ల వ్యూస్

Bullet bandi song
రచయిత లక్ష్మణ్‌ సాహిత్యం అందించగా ప్రముఖ గాయని మోహన భోగరాజు పాడిన 'నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా.. డుగు డుగు..` అనే పాట ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఏ వేడుక జరిగినా ఈ పాటకు కచ్ఛితంగా స్టెప్స్ వేస్తున్నారు. 
 
అయితే తాజాగా ఈ పాట యూట్యూబ్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకంగా వంద మిలియన్ల వ్యూస్ సాధించి అత్యధిక వీక్షకులను పొందిన జానపద పాటగా నిలిచింది. 
 
బ్లూ రాబిట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మాణంలో ఎస్‌కే బాజి సంగీతం అందించిన ఈ పాట ఈ ఏడాది ఏప్రిల్‌ 7వ తేదీన యూట్యూబ్‌లో విడుదలైంది. ఓ నవ వధువు ఈ పాటకు పెండ్లి బరాత్‌లో డ్యాన్స్‌ చేయడంతో ఈ పాట మరింత వైరల్‌గా మారింది.