శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 31 ఆగస్టు 2021 (12:06 IST)

అమెజాన్ ప్రైమ్‌కు "భీమ్లా నాయక్" డిజిటల్ రైట్స్‌

Bhemla Nayak
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం రానా దగ్గుబాటి తో కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అలాగే మలయాళంలో సూపర్ హిట్ అయిన "అయ్యప్పనుమ్ కోషియిమ్" సినిమాకి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా కోసం "భీమ్లా నాయక్" అనే టైటిల్ ను ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. 
 
సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది.
 
అయితే సినిమా నుంచి విడుదలైన టీజర్ కేవలం పవన్ కళ్యాణ్ పాత్రకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఉంటుంది. కాబట్టి ఈసారి దర్శకనిర్మాతలు రానా పాత్ర మీద ఒక టీజర్ విడుదల చేయాలని చూస్తున్నారట. 
 
త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి డైలాగులు అందిస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ను భారీ వ్యయంతో సొంతం చేసుకుంది. 
 
"వకీల్ సాబ్" సినిమా కూడా సూపర్ హిట్ అవడంతో అమెజాన్ వారు "భీమ్లా నాయక్" డిజిటల్ రైట్స్ ను భారీ మొత్తానికి కొన్నట్లు తెలుస్తోంది. ఆ ఫిగర్ ను మాత్రం దర్శకనిర్మాతలు బయటకు రానివ్వడం లేదు. ఇక ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.