బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 మే 2024 (17:27 IST)

'విశ్వంభర' సెట్స్‌లో అజిత్.. అలనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న చిరు

Chiru_Ajith
Chiru_Ajith
మెగాస్టార్ చిరంజీవి సోషియా ఫాంటసీ చిత్రం 'విశ్వంభర' వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. తాజాగా విశ్వంభర సెట్స్‌లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ సందడి చేశారు. 
 
ఆయన లేటెస్ట్ మూవీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా షూటింగ్ కూడా విశ్వంభర లొకేషన్ పక్కనే జరుగుతుంది. దీంతో చిరంజీవిని కలిసి సర్‌ప్రైజ్ ఇచ్చారు అజిత్.
 
మంగళవారం సాయంత్రం 'విశ్వంభర' సెట్స్‌లో స్టార్ గెస్ట్‌గా వచ్చి అజిత్‌ కుమార్ మా అందరినీ ఆశ్చర్యపరిచారంటూ చిరంజీవి తెలిపారు. 
 
అజిత్‌ సినిమా కూడా షూటింగ్‌ మా పక్కనే జరుగుతుండటంతో చాలా ఏళ్ల తర్వాత మేము కలిసే అదృష్టం దక్కింది. దీంతో అజిత్‌తో అలనాటి జ్ఞాపకాలను అలా ఓసారి గుర్తు చేసుకున్నానని చిరంజీవి తెలిపారు. 
 
అజిత్‌ తొలి సినిమా 'ప్రేమ పుస్తకం' ఆడియో లాంచ్‌ కార్యక్రమం తన చేతుల మీదుగానే జరిగిందని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు చిరంజీవి ఇన్ స్టాలో పోస్టు చేసిన అజిత్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
Ajith_Chiranjeevi
Ajith_Chiranjeevi
 
అజిత్ ఫ్యాన్స్, చిరంజీవి అభిమానులు ఈ పోస్టును షేర్ చేస్తూ మురిసిపోతున్నారు. 30 ఏళ్ల తర్వాత ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో, ఫొటో ఆఫ్ ది డెకేడ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.