గురువారం, 28 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 మార్చి 2023 (14:20 IST)

"రంగమార్తాండ" సినిమాపై చిరంజీవి ప్రశంసలు..

Rangamarthanda
"రంగమార్తాండ" సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం నటన ఎంతో భావోద్వేగానికి గురిచేసిందని తెలిపారు. ఇలాంటి చిత్రాలను అందరూ చూసి ఆదరించాలని కోరారు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్‌కి తన జీవితాన్నే కళ్ల ముందు చూస్తున్నట్లు అనిపిస్తుందని.. అలాగే ఈ చిత్రం ఓ త్రివేణి సంగమంలా అనిపించింది. 
 
కృష్ణవంశీ లాంటి క్రియేటివ్ డైరక్టర్.. ప్రకాశ్ రాజ్ లాంటి జాతీయ ఉత్తమ నటుడు బ్రహ్మానందం కలయిక.. వారి పనితనం.. ఆ ఇద్దరి అద్భుత నటన ఎంతో భావోద్వేగానికి గురిచేసిందని పేర్కొన్నారు. రసవత్తరమైన చిత్రం తీసిన కృష్ణవంశీ, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, చిత్ర యూనిట్ అందరికీ అభినందనలు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.