శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 నవంబరు 2020 (08:43 IST)

మాజీ ప్రియుడిపై కోర్టుకెక్కిన అమలాపాల్! ఎందుకో తెలుసా?

తన మాజీ ప్రియుడి భవీందర్‌పై సినీ నటి అమలా పాల్ కోర్టుకెక్కెదింది. ఓ వ్యాపార ప్రకటన కోసం తీసుకున్న ఫొటోలకు తప్పుడు శీర్షిక పెట్టి, తన మాజీ ప్రియుడు భవీందర్ సోషల్ మీడియాలో పోస్టు చేయడం ద్వారా పరువు తీశారని ఆరోపించారు. ఇదే అంశంపై ఆమె కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు... భవీందర్ సింగ్‌పై కేసు వేసేందుకు అనుమతించడం గమనార్హం.
 
కాగా, ఆ మధ్య అమలాపాల్‌కు, భవీందర్‌కు పెళ్లి జరిగిందని కూడా కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెల్సిందే. అయితే, అటువంటిదేమీ లేదని ఆమె వివరణ ఇచ్చింది. అంతకుముందు తమిళ దర్శకుడు ఎల్.విజయ్‌ని వివాహం చేసుకుని, అనంతరం, అతని నుంచి విడిపోయిన తర్వాత ముంబైకి చెందిన గాయకుడు భవీందర్‌తో లవ్‌తో పడి, ఆపై బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే.