సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 5 మే 2023 (16:53 IST)

బహు భాషా చిత్రం భారతీయన్స్ టీజర్ సూపర్ గా ఉందన్న డి.సురేష్ బాబు

D. Suresh Babu, Neeroj Pucha,  Deen Raj
D. Suresh Babu, Neeroj Pucha, Deen Raj
నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్, హీరోలుగా... సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ హీరోయిన్లుగా నటించిన బహు భాషా చిత్రం 'భారతీయన్స్'. భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై ప్రవాస భారతీయుడు డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రముఖ రచయిత - ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ దీన్ రాజ్ (ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా" ఫేమ్) ఈ దేశభక్తి చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
 
ఈ చిత్రం టీజర్ ను ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు రిలీజ్ చేసి, చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. తమ సంస్థకు "ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా" వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దీన్ రాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్న "భారతీయన్స్" బిగ్గెస్ట్ బ్లస్టర్ కావాలని ఆకాంక్షించారు. "భారత్ అమెరికన్ క్రియేషన్స్" బ్యానర్ కు ఈ చిత్రం శుభారంభం ఇవ్వాలని అభిలషించారు. 
 
దర్శకుడు దీనరాజ్ మాట్లాడుతూ ''దేశభక్తి సినిమాతో దర్శకుడిగా పరిచయం కావాలని ఈ కథ రాశా. మా నిర్మాతకు కూడా దేశభక్తి ఎక్కువ. శంకర్ గారు అమెరికాలో డాక్టర్. కథ నచ్చి సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించే చిత్రమిది. భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి ప్రశంసలు అందుకున్న మా చిత్రం టీజర్ ను లెజెండరీ ప్రొడ్యూసర్ డి.సురేష్ బాబు రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది'' అని అన్నారు. 
 
హీరోలలో ఒకరైన నీరోజ్ మాట్లాడుతూ ''హీరోగా నాకు ఫస్ట్ సినిమా ఇది. అవకాశం ఇచ్చిన నిర్మాత శంకర్ గారికి, దర్శకులు దీన్ రాజ్ గారికి థాంక్స్'' అని అన్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు ఫైట్స్: జూడో రాము, ఎడిటర్: శివ సర్వాణి, పి.ఆర్.ఓ: దీరజ్-అప్పాజీ, సినిమాటోగ్రఫీ: జయపాల్ రెడ్డి నిమ్మల, మ్యూజిక్ : సత్య కశ్యప్ & కపిల్ కుమార్, ప్రొడ్యూసర్ : డా; శంకర్ నాయుడు అడుసుమిల్లి, డైరెక్టర్: దీన్ రాజ్.