మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (11:36 IST)

బిగ్ బాస్ సీజన్-5 : నామినేషన్‌లో షణ్ముక్ జశ్వంత్

బిగ్ బాస్ సీజన్-5 ప్రారంభంతోనే ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంది. ఈసారి కూడా నాగ్ హోస్ట్‌గా చేస్తున్న సీజన్-5 లో మొత్తం పంతొమ్మిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక ఎక్కువ మంది కంటెస్టెంట్స్ ఉండటంతో కాస్త షో గందరగోళంగా మారందని కూడా కొంతమంది ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇక హౌస్ లోకి కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చిన మరుసటిరోజే సోమవారం రావడంతో నామినేషన్స్ కూడా మొదలయ్యాయి.
 
కాగా ఈ సారి నామినేషన్స్‌లో జెశ్వంత్ జెస్సీ, యాంకర్ రవి, ఆర్ జె కాజల్, హమీదా, 7 ఆర్ట్స్ సరయులు ఉన్నారు. అయితే జశ్వంత్ జెస్సీ, షణ్ముక్ జశ్వంత్‌ల పేర్లు దగ్గరగా ఉండటంతో నామినేషన్స్‌లో షణ్ముక్ జశ్వంత్ ఉన్నాడంటూ కొంతమంది వార్తలు రాస్తున్నారు. దాంతో షణ్ముక్ జశ్వంత్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. షణ్ముక్ నామినేషన్స్ లో లేరని చెబుతున్నారు.