నెట్‌ఫ్లిక్స్ సంస్థపై ధనుష్ కేసు.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్
ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌పై కోలీవుడ్ హీరో ధనుష్ కేసు పెట్టారు. ఈ మేరకు ఆయన మద్రాస్ హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. హీరోయిన్ నయనతార బయోగ్రఫీ కోసం తాను నిర్మాతగా తెరకెక్కించిన నానుమ్ రౌడీదా చిత్రంలోని పలు క్లిప్లింగ్స్‌ను అనుమతి లేకుండా ఉపయోగించారంటూ ఆయన ఆరోపించారు.
ఇదే అంశంపై ఇప్పటికే నయనతార, విఘ్నేష్ శివన్‌లపై రూ.10 కోట్ల మేరకు పరువు నష్టందావా వేసిన విషయం తెల్సిందే. ఇపుడు నెట్ ఫ్లిక్స్ సంస్థపై దావా వేశారు. బుధవారం ఈ పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం దీనిపై విచారణకు అంగీకరించింది. డాక్యుమెంటరీ విషయంలో నయనతార, ధనుష్ మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.
ఇక తమకెంతో ముఖ్యమైన నానుమ్ రౌడీ దాన్ విశేషాలను తన డాక్యుమెంటరీలో చూపించాలని కోరినా.. చిత్ర నిర్మాత ధనుష్ నుంచి పర్మిషన్ రాలేదని అందుకు తాను ఎంతో బాధపడ్డానని పేర్కొంటూ నయనతార ఇటీవల ఒక బహిరంగ లేఖ రిలీజ్ చేశారు. డాక్యుమెంటరీ ట్రైలర్‌లో మూడు సెకన్ల సీన్స్ ఉపయోగించినందుకు పరిహారంగా ఆయన రూ.10 కోట్లు డిమాండ్ చేశారని తెలిపారు. ఈసందర్భంగా ధనుష్‌ను నయనతార తప్పుబట్టిన విషయం తెల్సిందే.