నాతో చేయండి సార్! నేనింకా బాగా చేస్తా అన్న సుధీర్‌బాబు
Sudheer Babu, Hanu Raghapudi
హీరో సుధీర్ బాబు గురించి అందరికీ తెలిసిందే. మహేష్‌బాబు బావగారు. తను బాట్మింటర్ స్పోర్ట్స్ పర్సన్ కూడా. సినిమా అంటే పిచ్చి అందుకే ఈ రంగంలోకి వచ్చాడు. పలు భిన్నమైన పాత్రలు వేశారు. పాత్ర పరంగా 6ప్యాక్ బాడీని కూడా మార్చేస్తాడు. ఇంద్రగంటి మోహనకృష్ణతో సమ్మోహనం, ఆమె గురించి మీకు చెప్పాలి వంటి సినిమాలు చేశాడు. అయితే ఆయనకు సీతారామం దర్శకుడు హను రాఘపుడిపై కన్ను పడిండి. ఇటీవలే ఆయన్ను కలిసినప్పుడు ఆయన ఈ విధంగా తెలియజేశారు.
హను రాఘపుడిని చేయి పట్టుకుని మీరు నాకు ఇష్టమైన దర్శకుడు. మీ సినిమా అన్నీ చూశాను. సీతారామం సినిమా చూసి మీతో ప్రేమలో పడిపోయా. పర్సనల్‌గా నాకు బాగా నచ్చింది పడిపడిలేచె మనసు. పెద్దగా ఆడకపోయినా నాకు బాగా నచ్చింది. ఈ సినిమాలు ఆడినా ఆడకపోయినా నేను చూస్తాను. నాతో చేయండి సార్! నేనింకా బాగా చేస్తా. మరి నాతో ఎప్పుడు చేస్తారంటూ.. ఆయన్ను అడగగాను.. తప్పకుండా చేద్దామంటూ నవ్వుకుంటూ సమాధానంగా చెప్పారు.