మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 ఆగస్టు 2020 (18:34 IST)

150 రోజులపాటు ఇంటి నుంచి బయటకు రాని వైస్సార్.. ఎందుకని?

మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి 150 రోజులపాటు ఇంటి నుంచి బయటకు రాకుండా.. వ్యక్తిగతంగా రికార్డును సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసిందే. రోడ్ ట్రిప్‌కు వెళ్దామని కుమారుడు, హీరో దుల్హర్ సల్మాన్ మమ్ముట్టిని అడిగాడట. 
 
అయితే మమ్ముట్టి మాత్రం తాను ఇలా ఎన్ని రోజులు ఇలా ఇంటిపట్టునే ఉండగలుగుతానో చూస్తానని ఛాలెంజ్‌గా తీసుకున్నట్టు మమ్ముట్టి తెలిపాడు.  ఆయన ఇలా ప్రతీసారి ఏదో ఒక ఛాలెంజ్ తీసుకుంటాడని చెప్పాడు. క్వారంటైన్ టైంలో తన హాబీ అయిన ఫొటోగ్రఫీపై దృష్టి పెడుతున్నానని మమ్ముట్టి గతంలో చెప్పిన విషయం తెలిసిందే.
 
కాగా గతేడాది యాత్ర సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు మమ్ముట్టి. ఈ సినిమాలో వైఎస్సార్ పాత్రలో అద్భుతంగా నటించాడు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ఎఫెక్ట్‌తో చాలా కాలంగా ఇంటికే పరిమితమయ్యాడట మమ్ముట్టి. ఈ విషయాన్ని మమ్ముట్టి కుమారుడు దుల్హర్ సల్మాన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.