శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 18 ఏప్రియల్ 2024 (14:32 IST)

బిట్ కాయిన్ స్కామ్ కేసు : బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఇంటిని అటాచ్ చేసిన ఈడీ

Shilpa Shetty
బిట్ కాయిన్ స్కామ్ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఇంటిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అటాచ్ చేశారు. ముంబై జుహూ ఏరియాలో ఉన్న ఆమె ఫ్లాట్‌ను అటాచ్ చేశారు. దీంతో పాటు పూణెలో ఓ బంగ్లా సహా రూ.98 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను గురువారం అధికారులు అటాచ్ చేస్తూ నోటీసులు ఇచ్చారు. 
 
శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాపై బిట్ కాయిన్ పోంజి స్కామ్ కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు ఈడీ అధికారులు అటాచ్ చేసిన ఆస్తుల్లో జుహూలోని రెసిడెన్షియల్ ఫ్లాట్‌తో పాటు పూణెలో శిల్పాశెట్టి పేరు మీద ఉన్న ఓ బంగ్లా, రాజ్ కుంద్రా పేరిట ఈక్విటీ షేర్లు కూడా ఉన్నాయి. ప్రివిన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ 2002 కింద అధికారులు ఈ అటాచ్ నోటీసులు జారీ చేశారు. 
 
ఫోర్న్ రాకెట్ కేుసలో కూడా కుంద్రా నిందితుడే... 
సినిమా ఇండస్ట్రీలోని హీరోయిన్లుగా కూడా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న యువతులను బలవంతంగా పోర్న్ వీడియోల్లో నటింపజేశాడని రాజ్ కుంద్రాపై పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ కోణం కూడా ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ కేసులోకి ప్రవేశించా4రు. కేసు దర్యాప్తులో భాగంగా, రాజ్ కుంద్రా తన పేరు మీ ఉన్న విలువైన ఆస్తులను భార్య శిల్పాశెట్టి పేరు మీదకు బదిలీ చేసినట్టు గుర్తించిన ఈడీ అధికారులు ఆ ఆస్తులను ఆటాచ్ చేశారు.