సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 27 జూన్ 2020 (22:34 IST)

కరోనావైరస్ సోకిందని ఓంకార్‌పై అసత్య ప్రచారం

కరోనా లాక్ డౌన్ తర్వాత టెలివిజన్ షోస్ మొదలైన సంగతి తెలిసిందే. ఓంకార్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న "ఇస్మార్ట్ జోడి" పునఃప్రారంభం అయ్యింది. గత కొద్ది రోజులుగా ఓంకార్ కరోనావైరస్ సోకిందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
 
ఇది పూర్తిగా అవాస్తవమని కుటుంబ సభ్యులు ఖండించారు. కరోనా పరీక్షను ఓంకార్ చేయించుకున్నారు. నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. సోమవారం నుండి షూటింగ్‌లో పాల్గొంటున్నారు అని తెలియజేశారు కుటుంబ సభ్యులు.