శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 ఫిబ్రవరి 2020 (12:12 IST)

రానా ''అరణ్య'' టీజర్ అదుర్స్.. (వీడియో)

ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ''హాథీ మేరా సాథీ'' సినిమాలో రానా నటిస్తున్నాడు. ఈ సినిమాను తెలుగు, తమిళంలో ‘అరణ్య’గా పేరుతో విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తే మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన హిందీ వెర్షన్ ‘హాథీ మేరా సాథీ’ సినిమాకు సంబంధించిన టీజర్‌ విడుదలైంది. 
 
అడవిలో ఏనుగులను మచ్చిక చేసుకోని వాటితో సావాసం చేసే అడవి తెగకి చెందిన వ్యక్తిగా రానా లుక్ ఆకట్టుకునేలా వుంది. మానవుల స్వార్థం కోసం అడవులను ఆక్రమించడం, సహజ వనరులను నాశనం చేయడం వలన అడవి జంతువుల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది.
 
మనిషి స్వార్ధం వలన ఏనుగులు మనుగడ కోల్పోయే పరిస్థితి వస్తే దానిని ధైర్యంగా ఎదిరించిన వ్యక్తి కథగా అరణ్య తెరకెక్కింది. ఈ సినిమా టీజర్‌లో రానా నటన అద్భుతంగా వుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ రెండో తేదీన విడుదల చేయనున్నారు. ఇంకేముంది.. ఈ సినిమా టీజర్‌ను ఓ లుక్కేయండి.