శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 25 మార్చి 2021 (16:31 IST)

74 ఏళ్లుగా ఆ భ్ర‌మ‌లో వున్నామా! అని ప్ర‌శ్నించే ‘రిపబ్లిక్‌’

Republic look
‘చిత్రల‌హ‌రి’, ‘ప్ర‌తిరోజూ పండ‌గే’. ‘సోలో బ్రతుకే సో బెటర్’ వంటి వ‌రుస విజయాల‌తో దూసుకెళ్తోన్న సుప్రీమ్ హీరో సాయితేజ్ కథానాయకుడిగా వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలను తెరకెక్కించే దర్శకుడు దేవ్‌ కట్ట డైరెక్ష‌న్‌లో రూపొందుతోన్న పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ ‘రిప‌బ్లిక్‌’. గురువారం ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. 
 
ఫ‌స్ట్ లుక్‌లో హీరో  సాయితేజ్ కూలింగ్ గ్లాస్ వేసుకుని క‌నిపిస్తున్నారు. ఈ లుక్‌తో ఆడియెన్స్‌లో ఓ క్యూరియాసిటినీ క్రియేట్ చేశారు డైరెక్ట‌ర్ దేవ్‌క‌ట్ట‌. ఫ‌స్ట్‌లుక్‌ను ప‌రిశీలిస్తే, కూలింగ్ గ్లాస్‌లో హీరో ఎవ‌రితో చ‌ర్చ‌లు చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. భార‌త‌దేశం స్వాతంత్య్రాన్ని సాధించి 74 ఏళ్లు అవుతుంది. “డెబ్బై నాలుగేళ్ళుగా ప్రభుత్వం ఉందన్న భ్రమలో బతుకుతున్నాం, కానీ ఇంకా ఆ ప్రభుత్వం ఎలా ఉంతుందో కూడా తెలీదు మనకు” అనుకుని స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేసే అభి అనే యువ‌కుడిగా సాయితేజ్ ఓ ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. 
 
జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్ ప‌తాకాల‌పై ఈ చిత్రాన్నినిర్మాత‌లు జె.భగవాన్, జె.పుల్లారావు అన్ కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వ‌ర‌ల్డ్‌వైడ్‌గా జూన్ 4న విడుదల చేస్తున్నారు. ఐశ్వ‌ర్యా రాజేశ్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో విలక్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.