మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 జూన్ 2022 (13:26 IST)

సోషల్ మీడియాలో నటి నమిత సీమంతం ఫోటోలు వైరల్

namitha seemantham
సినీ నటి నమిత తాజాగా సీమంతం వేడుకలను జరుపుకున్నారు. ఇందుకోసం ఆమె అందంగా ముస్తాబయ్యారు. నెలలు నిండుతున్న కొద్దీ ముఖంలో పెరిగే ప్రెగ్నెన్సీ కళతో ఈ వేడుకలో మరింతగా మెరిసిపోయింది. ఈ క్రమంలోనే తన సీమంతం ఫొటోల్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకొని మురిసిపోయింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.
 
ఇటీవలే సీమంతం వేడుకను జరుపుకొన్న ఆమె.. ఆ ఫొటోల్ని కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఇందులోభాగంగా సంప్రదాయబద్ధంగా పట్టుచీరలో కనిపించారు. ఈ వేడుకకు హాజరైన కొందరు ప్రముఖులు కూడా నమిత సీమంతం ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. కాగా, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో మెరిసిన నమిత.. 2017లో సహ నటుడు వీరేంద్ర చౌధరిని వివాహం చేసుకుంది.