సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వి
Last Modified: గురువారం, 30 జులై 2020 (14:58 IST)

తెలుగు రాష్ట్రాలలో సినిమా హాళ్లు ప్రారంభమయ్యే అవకాశముందా?

కరోనావైరస్ విజృంభణ నేపధ్యంలో అన్‌లాక్‌డౌన్ 3 తెలుగు ప్రేక్షకులకు వెండితెరపై సినిమాను చూపించనుంది. ఆగస్టు 1 నుంచి సినిమా థియేటర్లు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అన్‌లాక్‌డౌన్ 3తో థియేటర్ల యజమానులకు లాభాలు మాట అటుంచితే, నిర్వహణ మాత్రం పిప్టీ-పిప్టీ అంటున్నారు.
 
ఆగస్టు 1 నుంచి సినిమా థియేటర్లు తెరుచుకునే అవకాశముందన్న వార్తలు వస్తుండటంతో చిత్రసీమలో ఆశలు రేగుతున్నాయి. కరోనా లాక్ డౌన్‌తో థియేటర్లు మూతపడినా ఖర్చులు మాత్రం ఆగలేదంటున్నారు యజమానులు. వర్కర్లు, కరెంటు ఇలా పలు సమస్యలుంటే ఇప్పుడు శానిటేషన్ అతి పెద్ద ఖర్చులు అంటున్నారు.
 
మరోవైపు ఓటీఆర్ ద్వారా సినిమాలు రిలీజ్ అయినా థియేటర్లో చూసిన అనుభూతి రాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు థియేటర్లను ప్రారంభించక పోవడమే మంచిదంటున్నారు.