శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 9 మార్చి 2019 (15:43 IST)

అంతా గీత గోవిందం వల్లే.. గీతా ఆర్ట్స్2 మీద ఐటీ దాడులు?

గీతా ఆర్ట్స్ తాజాగా గీత గోవిందం సినిమాను తెరకెక్కించింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు పరుశురాం తెరకెక్కించారు. గీతా గోవిందం చిత్రం స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా వసూళ్లు సాధించడం విశేషం. విజయ్ దేవరకొండ ఈ చిత్రంతో 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన హీరోగా మారిపోయాడు. అల్లు అరవింద్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించగా, బన్నీ వాసు నిర్మించారు. 
 
ఈ నేపథ్యంలో గీతగోవిందం సినిమా వసూళ్ల లెక్కలు తేల్చేందుకు ఐటీ అధికారులు జూబ్లీహిల్స్ లోని గీతా ఆర్ట్స్ 2 కార్యాలయంపై దాడులు నిర్వహించినట్లు సమాచారం. వసూళ్లకు తగ్గట్లుగా ఆదాయపు పన్ను చెల్లించారా లేదా అనే విషయంలో అధికారులు డాక్యుమెంట్స్ పరిశీలించినట్లు తెలుస్తోంది. కాగా గీతా ఆర్ట్స్ బ్యానర్ కింద పలు విజయవంతమైన సినిమాలు తెరకెక్కాయి. 
 
ఇటీవల గీత ఆర్ట్స్ 2 పేరుతో మరో సంస్థని ప్రారంభించి అందులో సమర్పకుడిగా చిత్ర నిర్మాణంలో భాగమవుతున్నారు. తాజాగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించినట్లు సమాచారం.