శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By
Last Updated : సోమవారం, 4 మార్చి 2019 (14:20 IST)

ఈశాన్యంలో ఆఫీసు వాడొచ్చా..?

ఇప్పటి కాలంలో ఎక్కడ చూసినా ఆఫీసు కట్టడాలు ఎక్కువైపోతున్నాయి. రోజూ ఇంట్లో నివాసం ఉండడం కంటే ఆఫీసులోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. అలాంటప్పుడు ఆఫీసు కట్టడం వాస్తుప్రకారం నిర్మించాలని పండితులు చెప్తున్నారు. కొందరిలో ఈశాన్యం గదిలో ఆఫీసు పెట్టుకొని వాడొచ్చా.. లేదా వాయవ్యం గదినే వాడాలా.. అని తెలియక సతమతమవుతున్నారు. అలాంటి వారి కోసం..
 
ఇంట్లో నివాసంతో పాటు ఆఫీసు ఏర్పాటు చేసుకుని జీవించే పద్ధతి చాలామందికి అవసరం పడుతుంది. ప్రధానంగా లాయర్లు ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులకు. గృహం-జీవన వృత్తి ఒకేచోట సాగించాలని అనుకుంటే ఇంటి నిర్మాణం ప్లానులోనే అందుకు అనుగుణంగా ఆఫీసు గది, విజిటర్స్ గది విభజనం చేసుకోవాలి.
 
వృత్తిని ఉత్తరం వైపు గృహ జీవనం దక్షిణం వైపు, వచ్చేలా గదుల విభజన చేసుకోవాలి. తూర్పు ద్వార నుండి గృహానికి ఉత్తరం ద్వారం వ్యాపార వ్యవహారానికి వాడుకోవాలి. ఏదీ మరో దానిని విభేదించకుండా మీరు ఈశాన్యం గది సాధారణ డ్రాయింగ్ రూముగా వాడుకుని ఉత్తరం మధ్యలో కానీ వాయవ్యం గదిని కానీ ఆఫీసుగా వాడుకోండి. అప్పుడు మీకు అనుకూలంగా ఉంటుంది. గృహం-వృత్తి పనులకు ఇబ్బందులు ఏర్పడవు.