''సైరా"లో జగపతి బాబు లుక్ ఎలా వుందంటే?
''సైరా''లో విలక్షణ నటుడు జగపతిబాబు లుక్ విడుదలైంది. మెగాస్టార్ హీరోగా తెరకెక్కే సైరా నరసింహా రెడ్డి సినిమాలోని జగపతి బాబు లుక్‌ను ఆయన పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. జగపతి బాబు లుక్‌తో పాటు మోషన్ టీజర్‌ను సైరా టీమ్ విడుదల చేసింది.
సైరాలో జగపతిబాబు వీరారెడ్డి పాత్రలో కనిపిస్తున్నారని.. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు టీమ్ వెల్లడించింది. ఈ లుక్‌లో జగపతిబాబు.. గుబురు గడ్డంతో పాటు పొడవైన జట్టు, తలపాగా కనిపిస్తున్నారు. ఇక జగపతిబాబు సైరా లుక్‌ను టీజర్‌లో ఓ లుక్కేయండి.