సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 31 డిశెంబరు 2018 (14:30 IST)

'జై బాలయ్య’ అంటూ హంగామా చేసిన తారక్...(Video)

అగ్ర తారలంతా దర్శకధీరుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ, పూజల పెళ్లి సంగీత్‌లో సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ పెళ్లి వేడుక జయపురలో జరిగింది. ఈ నేపథ్యంలో అగ్ర తారలంతా శుక్రవారమే జయపురకు చేరుకున్నారు. శనివారం మెహందీ, సంగీత్ కార్యక్రమాలు జరిగాయి. ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా కార్తీకేయ, పూజల వివాహం జరిగింది.
 
ఈ సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్‌ల మధ్య సరదా సరదా సన్నివేశాలు, డ్యాన్సులకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే బయటకు వచ్చాయి. ఈ సందర్భంగా మరొక ఆసక్తికర సన్నివేశం కూడా చోటుచేసుకుంది. పెళ్లి వేడుకులో ఎన్టీఆర్ తన బాబాయి బాలకృష్ణ గురించి మాట్లాడుతుండగా తీసిన వీడియో ఒకటి వైరల్ అయింది. 
 
ఎన్టీఆర్ మాట్లాడుతున్న సమయంలో అంతా ‘జై బాలయ్య’ అంటూ నినాదాలు చేశారు. అయితే అంతా సైలెంట్ అయిన తరువాత ఎన్టీఆర్ ‘జై బాలయ్య’ అంటూ హంగామా చేశాడు. చూడండి ఆ వీడియో...