అక్కినేని అభిమానుల మ‌న‌సు దోచుకున్న ఎన్టీఆర్..!

NTR
శ్రీ| Last Modified సోమవారం, 21 జనవరి 2019 (16:50 IST)
నంద‌మూరి - అక్కినేని కుటుంబాల మ‌ధ్య ఉన్న అనుబంధం గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. నాడు ఎన్టీఆర్ - అక్కినేని, త‌ర్వాత నాగార్జున - హ‌రికృష్ణ మ‌ధ్య ఉన్న అనుబంధం తెలిసిందే. మూడ‌వ త‌రంలో కూడా ఆ అనుబంధం కొన‌సాగుతోంది. అఖిల్ - తార‌క్ మ‌ధ్య‌, చైత‌న్య - తార‌క్ మ‌ధ్య కూడా మంచి స్నేహం ఉంది. ఆ కార‌ణంగానే అఖిల్ మిస్ట‌ర్ మ‌జ్ను సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

ఈ వేడుక‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ... రాసి పెట్టుకోండి. ఈ రోజు చెబుతున్నాను. అఖిల్ విల్ బి వ‌న్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్ట‌ర్ వ‌న్ డే. మీ అంద‌రితో పాటు నేను కూడా ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అది ఎంతో దూరంలో లేదు.. ద‌గ్గ‌ర‌లోనే ఉంది. అది మిస్ట‌ర్ మ‌జ్ను సినిమాతో అని మీకు కూడా తెలుస్తుంది.

మిస్ట‌ర్ మ‌జ్ను చిత్రం అఖిల్ కెరీర్లో ఒక గొప్ప చిత్రంగా మిగ‌లాల‌ని ఆ దేవుడిని మ‌న‌సారా కోరుకుంటున్నాను అన్నారు. అఖిల్ గురించి ఈ విధంగా మాట్లాడి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అక్కినేని అభిమానుల మ‌న‌సు దోచుకున్నాడు. మ‌రి.. అంద‌రి అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా మిస్ట‌ర్ మ‌జ్ను ఘ‌న విజ‌యం సాధించి అఖిల్‌కి తొలి విజ‌యాన్ని అందిస్తుంద‌ని ఆశిద్దాం.దీనిపై మరింత చదవండి :