సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: ఆదివారం, 11 మార్చి 2018 (19:05 IST)

క‌ళ్యాణ్ రామ్ ఎం.ఎల్.ఎ ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్..

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా నూత‌న ద‌ర్శ‌కుడు ఉపేంద్ర మాధ‌వ్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్న చిత్రం ఎం.ఎల్.ఎ. ఈ చిత్రానికి మంచి ల‌క్ష‌ణాలున్న అబ్బాయ్ అనేది ట్యాగ్ లైన్. టి.జి. విశ్వ‌ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో కిర‌ణ్ రెడ్డి, భ‌ర‌త్ చౌద‌రి సంయుక్తంగా నిర్మిస్త

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా నూత‌న ద‌ర్శ‌కుడు ఉపేంద్ర మాధ‌వ్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్న చిత్రం ఎం.ఎల్.ఎ. ఈ చిత్రానికి మంచి ల‌క్ష‌ణాలున్న అబ్బాయ్ అనేది ట్యాగ్ లైన్. టి.జి. విశ్వ‌ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో కిర‌ణ్ రెడ్డి, భ‌ర‌త్ చౌద‌రి  సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న‌ కాజల్ హీరోయిన్‌గా నటించింది.
 
మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో వేడుకను ఈ నెల 17న కర్నూలులో భారీ స్ధాయిలో నిర్వహించనున్నారు. బ్రహ్మానందం పాత్ర ఈ సినిమాకి హైలెటై‌గా ఉంటుంద‌ట‌. ప్రసాద్ మురెళ్ళ సినిమాటోగ్రఫి అందించిన ఈ సినిమాలోని మొదటి పాట విడుదలై పాపులర్ అయ్యింది. మాస్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. ఇక ఈ భారీ చిత్రాన్ని ఈ నెల 23న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేసారు.