సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 20 అక్టోబరు 2023 (18:08 IST)

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అత్త అయ్యారు...

kangana aunt
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అత్త అయ్యారు. ఆమె సోదరుడు అక్షత్ రనౌత్ భార్య రీతూ రనౌత్ ఇటీవల ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఆ బాబు ఫోటోలు, ఆ బాబుని ఎత్తుకునివున్న ఫోటోలు, కంగనా తల్లి, సోదరుడు ఉన్న ఫోటోలను కంగనా రనౌత్ సోషల్ మీడియాలో షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. 
 
ఈ ఫోటోల కింద... నా సోదరుడు, అతని భార్య తల్లిదండ్రులు అయ్యారు. చక్కని బాబుకు జన్మనిచ్చారు. ఆ బాబుకి అశ్వత్థామ అనే పేరు పెట్టాం. బాబుని, మా కుటుంబాన్ని ఆశీర్వదించండి అని పోస్ట్ చేశారు. 
 
దీంతో కంగనా తన మేనల్లుడిని ఆప్యాయంగా ఎత్తుకునివున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ అయ్యాయి. ఇక పలువురు అభిమానులు, నెటిజన్లు, ప్రముఖులు కంగనా సోదరుడు, అతని భార్యకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.