మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 జనవరి 2024 (11:32 IST)

కేజీఎఫ్ స్టార్ యష్‌కు జోడీగా కరీనా కపూర్..?

kareena
కేజీఎఫ్ చిత్రం ద్వారా అంతర్జాభారతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న నటుడు యష్. తాజాగా తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. కీతు మోకందాస్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం ‘టాక్సిక్’ అని పేరు పెట్టారు. 2025 ఏప్రిల్ 10వ తేదీ విడుదల అవుతుందని ప్రకటించారు. 
 
ఈ చిత్రంలో యష్‌కు జోడీగా నటి కరీనా కపూర్ కథానాయికగా నటింపజేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. కరీనా కపూర్ ఇందులో నటించేందుకు ఓకే చెప్తుందా అనే విషయాన్ని పక్కనబెడితే ఈ సినిమా.. పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. 
 
43 వయస్సులో యష్ సరసన నటించేందుకు కరీనాకు తగిన అందం వుంది. ప్రస్తుతం, కరీనా కపూర్‌లో "ది గాంధీనగర్ కథ" చిత్రంలో నటిస్తోంది. ఆ తర్వాత, సూర్య చిత్రంలో నటించేందుకు చర్చలు జరుగుతున్నాయి.