యాత్ర 2 లో ధీర వనిత వై.ఎస్.భారతిగా కేతకి నారాయణన్
యాత్ర 2 సినిమాలో వై.ఎస్. భారతిగా కేతకి నారాయణన్ నటించింది. బాలీవుడ్ కు చెందిన ఈమె భారతి పాత్రకు సూట్ అయింది. ఆమె స్టిల్ విడుదలచేసిన చిత్ర బ్రుందం ఒక నాయకుడి ఎదుగుదల వెనుక నిలకడగల శక్తి, నిజమేన్నా మా ఇంట్లో ఆడవాళ్ళకి రాజకీయాలు, వ్యాపారాలు నేర్పించలేదు. అల్లానే మాకు కష్టం, సమస్య వస్తే భయపడి వెనుదిరిగడం కూడా నేర్పించలేదు.. అనే కాప్షన్ తో ఆ పాత్ర తీరును వెల్లడించారు.
మళయాళ స్టార్ మమ్ముట్టి వై.ఎస్.గా హీరో జీవా కాంబినేషన్ లో యాత్ర చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు మహి వి రాఘవ తెరకెక్కిస్తున్న గ్రాండ్ బయో పిక్ సీక్వెల్ చిత్రం “యాత్ర 2”. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా వి సెల్యులాయిడ్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే 8 ఫిబ్రవరి, 2024 నుండి సినిమా థియేటర్లలో.విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.