గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 ఏప్రియల్ 2022 (20:58 IST)

కేజీఎఫ్ ఛాప్టర్ 2: థియేటర్‌లో ఫైర్.. వ్యక్తికి గాయం

Yash
యష్ హీరోగా కేజీఎఫ్ ఛాప్టర్ 2 తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లలో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి థియేటర్లో తుపాకీతో హల్‌చల్ చేశాడు. 
 
యష్ డైలాగ్స్‌ని అనుకరిస్తూ తుపాకీని గాలిలోకి లేపి ఫైర్ చేశాడు. ఈ అనుకోని సంఘటనకు థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. ఈ ఘటన కర్ణాటక, శిగ్గావిలోని రాజశ్రీ థియేటర్‌లో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. గత రాత్రి కేజీఎఫ్-2 చూడడానికి వచ్చిన ఒక ఆగంతకుడు.. థియేటర్‌లో హల్చల్ చేశాడు. యష్ పవర్ ఫుల్ డైలాగ్‌ని అనుకరిస్తూ గాలిలో తుపాకిని లేపి మూడు రౌండ్లు కాల్చాడు. ఈ కాల్పుల్లో వసంత్ కుమార్ అనే వ్యక్తికి కాలిలో బుల్లెట్ దిగడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. 
 
వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.