శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 14 సెప్టెంబరు 2017 (12:42 IST)

ధైర్యానికే ఓ ముఖం ఉంటే అది కంగనా రనౌతే : సమంత ట్వీట్

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌‍పై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రశంసల జల్లు కురిపించింది. బాలీవుడ్ సినీ రంగంలోని లొసుగులను కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తూ వ్యంగ్య రూపకంగా తీసిన ఓ మ్యూజిక్ వీడియోను నటి

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌‍పై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రశంసల జల్లు కురిపించింది. బాలీవుడ్ సినీ రంగంలోని లొసుగులను కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తూ వ్యంగ్య రూపకంగా తీసిన ఓ మ్యూజిక్ వీడియోను నటి కంగనా రనౌత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై సమంత స్పందించింది. బాలీవుడ్‌ తీరును వీడియో ద్వారా ఎండగట్టిన కంగనా రనౌత్‌ను కొనియాడుతూ పోస్టులు చేసింది. 
 
కంగనా రనౌత్‌ ధైర్యాన్ని మెచ్చుకుంటున్న‌ట్లు త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొంటూ ఆ వీడియోను సమంత షేర్ చేసింది. కంగనా ఓ లెజెండరీ అంటూ సమంత కితాబిచ్చింది. ధైర్యానికే ఓ ముఖం ఉంటే అది కంగ‌నా ర‌నౌతేన‌ని ట్వీట్ చేసింది.
 
మరోవైపు అక్కినేని నాగార్జున సతీమణి అమల సెప్టెంబ‌ర్ 12న త‌న 49వ బ‌ర్త్‌డే వేడుక‌లు జరుపుకున్నారు. అమ‌ల బ‌ర్త్‌డే సంద‌ర్భంగా నాగార్జున స్పెష‌ల్ బ‌ర్త్ డే విషెస్ తెలియ‌జేశారు. ‘ఐ లవ్యూ స్వీట్‌హార్ట్‌. నీతో కలిసి చాలా కాలం జీవించాలని నాకు నేనే విష్‌ చేసుకుంటున్నా. హ్యాపీబర్త్‌డే’ అని ట్వీట్‌ చేయ‌గా, ప‌లువురు సెల‌బ్రిటీలు కూడా అమ‌ల‌కి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.
 
ఈ క్రమంలో బుధవారం సాయంత్రం అమల బర్త్ డే కేక్ కట్ చేశారు. ఈ సందర్భాన్ని సమంత వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. సామ్ షేర్ చేసిన వీడియోలో నాగ చైత‌న్య కూడా కనిపిస్తున్నాడు.  స‌మంత అక్టోబ‌ర్ 6న చైతూని వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం రంగ‌స్థ‌లం 1985, మ‌హాన‌టి, రాజుగారి గది2 ల‌తో పాటు ప‌లు తమిళ చిత్రాల‌తో సమంత చాలా బిజీగా ఉంది.