శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 అక్టోబరు 2023 (13:27 IST)

లియోకు 3.5/5 మార్కులిచ్చిన ఉమైర్.. ఫస్ట్ రివ్యూ

Leo
Leo
దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్‌గా తెరకెక్కిన భారీ యాక్షన్ డ్రామా లియో గురించి అందరికీ తెలిసిందే. దసరా కానుకగా ఈ సినిమాని ప్యాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. లియో హిందీ మార్కెట్‌లోనూ స్ట్రాంగ్‌గా ఉండబోతోంది.
 
లియో హిందీలో స్ట్రాంగ్‌గా వుండేందుకు సంజయ్ దత్ పాత్రే కారణం. ఈ సినిమాతో తమిళ ఇండస్ట్రీలో అరంగేట్రం చేయబోతున్నాడు. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. 
 
దేశంతో పాటు విదేశాల్లోనూ ఈ సినిమా అట్టహాసంగా విడుదల కానుంది. తాజాగా లియో గురించి ఉమైర్ సంధు ట్విట్టర్‌లో స్పందించాడు. లియోలో విజయ్ సినిమా మొత్తం కనిపించాడు. 
 
చిత్రం సాధారణ కథాంశాన్ని కలిగి ఉన్నప్పటికీ, అది ఆకట్టుకునే డ్రామా, యాక్షన్‌తో అద్భుతంగా తెరకెక్కించబడింది. టెన్షన్, యాక్షన్, ఎమోషన్, సరైన మిక్స్‌ను లియో ద్వారా చూడొచ్చునని.. ఈ సినిమాకు రేటింగ్ 3.5/5గా ఇస్తానని ఉమైర్ తెలిపాడు.