శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 సెప్టెంబరు 2022 (14:28 IST)

హాయ్.. చిల్లీ గయ్స్... పూరీ కనెక్ట్స్ విల్ వి బౌన్స్ బ్యాక్ : చార్మీ

charmy kaur
దర్శకుడు పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వచ్చిన "లైగర్" చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. దీంతో ఆ చిత్ర నిర్మాణ సంస్థలు భారీ నష్టాలను చవిచూశాయి. డిస్ట్రిబ్యూటర్లు కూడా కోలుకోలేని పరిస్థితి నెలకొంది. పూరి జగన్నాథ్, చార్మీతో పాటు బాలీవుడు నిర్మాత కరణ్ జోహార్ సారథ్యంలోని ధర్మా ప్రొడక్షన్స్‌లు కలిసి భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కించారు. గత నెల 25 తేదీ పాన్ ఇండియా మూవీగా విడుదలై చెత్త టాక్‌తో ఫ్లాప్ అయింది. ఈ చిత్ర నిర్మాణం కోసం పెట్టిన ఖర్చులో సగం కూడా రాబట్టలేని పరిస్థితి నెలకొంది. 
 
ముఖ్యంగా లైగర్ ప్రమోషన్ కార్యక్రమాల్లో ఈ చిత్రం ఓ రేంజ్‌లో ఉంటుందంటూ చిత్ర బృందం ప్రచారం చేసింది. కానీ, ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయింది. ఈ క్రమంలో చార్మీ కౌర్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కొన్నాళ్ళపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండనున్నట్టు ప్రకటించింది. 
 
ఈ మేరకు ఆదివారం ఉదయం ఆమె ఓ ట్వీట్ చేసింది. "హాయ్ చిల్లీ గయ్స్... కాస్త శాంతించండి. చిన్న బ్రేక్ తీసుకుంటున్నా.. సోషల్ మీడియా నుంచి. పూరీ కనెక్ట్స్ మళ్లీ దృఢంగా, మెరుగ్గా తిరిగివస్తుంది. అప్పటివరకు బ్రతకండి. బ్రతకనివ్వండి" అంటూ హార్ట్ ఎమోజీని యాడ్ చేసి ట్వీట్ చేసింది.