గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 20 అక్టోబరు 2018 (14:53 IST)

మ‌హేష్ బాబు మ‌ళ్లీ అదే త‌ప్పు చేసాడు. అస‌లు ఏమైంది..?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఉన్న ఇమేజ్ ఎలాంటిదో తెలిసిందే. వివాదాల‌కు దూరంగా త‌న ప‌ని ఏదో అది చేసుకుంటూ ఉంటారు. అయితే.. ఒక్కొక్క‌సారి చిన్న పొర‌పాటు వ‌ల‌న వార్త‌ల్లో నిల‌వ‌డం.. కొంతమంది నుంచి వ్య‌తిరేకత ఎదుర్కొవ‌ల్సి రావ‌డం జ‌రుగుతుంటుంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే... ద‌స‌రా సంద‌ర్భంగా మ‌హేష్ బాబు తెలుగు, త‌మిళ్, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో అభిమానుల‌కు ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలియ‌చేసాడు.
 
క‌న్న‌డ భాష‌లో ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలియ‌చేయ‌డం మ‌రిచిపోయాడు. అంతే... కన్న‌డ అభిమానుల‌కు కోపం వ‌చ్చింది. వెంట‌నే సోష‌ల్ మీడియాలో ఫైర్ అయ్యారు. పొర‌పాటును గ్ర‌హించిన మ‌హేష్ బాబు వెంట‌నే క‌న్న‌డ అభిమానుల‌కు ద‌స‌రా శుభాకాంక్ష‌లు అంటూ ట్వీట్ చేయ‌డంతో వారు శాంతించారు. క‌న్న‌డ అభిమానుల‌ను మ‌రిచిపోవ‌డం ఇదే ఫ‌స్ట్ టైమ్ కాదు. భ‌ర‌త్ అనే నేను సినిమా విష‌యంలో కూడా మ‌హేష్ ఇలాగే మ‌ర‌చిపోయాడు.