గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 9 ఫిబ్రవరి 2023 (09:38 IST)

ఆధార్‌ వెరిఫికేషన్‌ చేయించుకున్న మహేష్‌బాబు

Mahesh adhar verivication
Mahesh adhar verivication
సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు తాజాగా తన ఆధార్‌ పూర్తి వివరాలకు సంబంధించిన వెరిఫికేషన్‌ చేయించుకున్నారు. కేంద్రప్రభుత్వం అన్ని రాష్ట్రాలలో ప్రజలకు ఆధార్‌ మార్పులు, చేర్పుల గురించి వివరిస్తూ ప్రకటన కూడా జారీ చేసింది. త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంతోపాటు దేశ భద్రత దృష్ట్యా ఆధార్‌ వెరిఫికేషన్‌ మస్ట్‌గా చేయించాలని నిర్ణయించింది.
 
అందులో భాగంగా మహేష్‌బాబు ఆధార్‌లో మార్పులు చేయించుకున్నారా అనేది క్లారిటీలేదు. తాజాగా ఆయన ఎస్‌.ఎస్‌.ఎం.బి.28 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే సారథిస్టూడియోలో ప్రారంభమైంది. కొంత యాక్షన్‌ పార్ట్‌ తీశారు. రామ్‌ లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో షూట్‌ చేశారు. అనంతరం నిన్నటినుంచి మాదాపూర్‌లోని యశోధ ఆసుపత్రిలో కొన్ని సీన్లు చిత్రీకరించారు. అయితే మహేష్‌బాబు ఆధార్‌ వెరిపికేషన్‌ చేస్తున్న ఫొటో ట్విట్టర్‌లో పోస్ట్‌ అయింది. బహుశా ఇది త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఎస్‌.ఎస్‌.ఎం.బి.28లో ఓ భాగమా, లేదా వ్యాపార ప్రకటన చేస్తున్నాడనేది తేలలేదు. అభిమానులు మాత్రం సినిమాలో ఓ సన్నివేశం అయివుంటుందని వెల్లడిస్తూ ఫిబ్రవరి 8వ తేదీన జరిగిన విషయంగా తెలియజేశారు.