1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Making Of Bharat Ane Nenu Assembly set

మహేష్ బాబు 'భ‌ర‌త్ అనే నేను' అసెంబ్లీ మేకింగ్ వీడియో

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, కైరా అద్వానీ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "భరత్ అనే నేను". ఈ చిత్రం ఈనెల 20వ తేదీన విడుదలై కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఫిక్ష‌న్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చి

Bharat Ane Nenu
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, కైరా అద్వానీ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "భరత్ అనే నేను". ఈ చిత్రం ఈనెల 20వ తేదీన విడుదలై కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఫిక్ష‌న్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది. త్వ‌ర‌లో విజ‌యోత్సవ వేడుకని కూడా గ్రాండ్‌గా జ‌ర‌ప‌నున్నారు.
 
చిత్రంలో మ‌హేష్ డైన‌మిక్ సీఎంగా క‌నిపించగా, ఆయ‌న పాత్ర‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది. సినిమా సెల‌బ్రిటీలే కాదు రాజ‌కీయ నాయ‌కులు కూడా చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అయితే ఈ చిత్రంలో అసెంబ్లీ సెట్ సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. 
 
అసెంబ్లీని త‌ల‌పించేలా వేసిన ఈ సెట్ ఎలా రూపొందించార‌నే విష‌యాన్ని మేకింగ్ వీడియో ద్వారా ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌ సురేష్ సెల్వ‌రాజ‌న్‌, న‌టుడు పోసాని కృష్ణ ముర‌ళి, నిర్మాత దాన‌య్యలు వివ‌రించారు. ఆ వీడియోను మీరూ తిలకించండి. 
 
<iframe width="650" height="350" src="https://www.youtube.com/embed/Dxh06F3ekwI" frameborder="0" allow="autoplay; encrypted-media" allowfullscreen></iframe>
 
 
Making Of Bharat Ane Nenu Assembly | Mahesh Babu | Siva Koratala | Kiara Advani | DSP
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
బాహుబలి రికార్డును అధిగమించే దిశగా భరత్ అనే నేను... ఎలా?