శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 మే 2020 (20:21 IST)

తితిదే ఆస్తులు అమ్మమని దేవుడేమన్నా చేప్పాడా: మంచు మనోజ్ ప్రశ్న

తమిళనాడులోని శ్రీవారి నిరవర్ధక ఆస్తులను విక్రయించాలని ఏపీ సర్కారు, తితిదే నిర్ణయించింది. దీనిపై సినీ హీరో మంచు మనోజ్ స్పందించారు. తితిదే ఆస్తులు అమ్మమని దేవుడేమన్నా చెప్పాడా? అని ప్రశ్నించారు. అడిగే హక్కు నాకుంది కాబట్టి అడుగుతున్నానంటూ మంచు మనోజ్ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ ద్వారా మంచు మనోజ్ రియల్ హీరోకి అర్థం చెప్పారంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ మంచు మనోజ్ విడుదల చేసిన ఓ లేఖలో పేర్కొన్న విషయాలను పరిశీలిస్తే, 
 
" ఓం న‌మో వేంక‌టేశాయ‌ 
తితిదే ఆస్తులు అమ్మ‌మ‌ని దేవుడేమ‌న్నా చెప్పాడా? క‌రోనా సంక్షోభంలో రోజుకు ల‌క్ష మందికి ఆక‌లి తీర్చ‌మ‌ని కూడా దేవుడు ఏమ‌న్నా చెప్పాడా? చేసేది, చెప్పేది అంతా తితిదే పాల‌క మండ‌లి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఆస్తుల‌ను, కొండ‌కి వ‌చ్చిన ల‌క్ష‌లాది మందిని, సుప్ర‌భాత సేవ‌కి టైమ్ అయ్యింది నిద్ర లేవాలి.. అని శ్రీ‌హ‌రిని సైతం కంట్రోల్ చేసేది టీటీడీ పాల‌క మండ‌లి. 
 
కొండ‌పైన ఉన్న వ‌డ్డీ కాసుల‌వాడి ఆస్తులు అమ్మ‌కానికి వ‌చ్చాయి అంటే 'గోవిందా గోవిందా' అని అర‌చిన ఈ గొంతు కొంచెం త‌డ‌బ‌డింది. మోసం జ‌ర‌గ‌ట్లేదు అని తెలుసు. ఎందుకంటే ఇన్‌సైడ్ ట్రేడింగ్ లాగా కాకుండా వేలం వేసి అంద‌రి ముందూ అంద‌రు చూస్తుండ‌గానే అమ్మ‌కం జ‌రుపుతారు. 
 
కానీ, ఎందుకు అమ్ముతున్నారు?.. అని పాల‌క మండ‌లిని కాస్త వివ‌ర‌ణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వివ‌ర‌ణ మాత్ర‌మే. ఏమీ లేదు సార్‌. ఇంత పెద్ద కొండ మాకు అండ‌గా ఉంది అని చూస్తూ మురిసిపోయే తిరుప‌తి వాడిని కాబ‌ట్టి ఆపుకోలేక అడుగుతున్నా సార్‌.. అంతే". 
 
జై హింద్‌..
మీ 
మ‌నోజ్ మంచు