శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Updated : శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (18:04 IST)

మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం అప్పుడే...

గత కొద్ది కాలంగా బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. 2017లోనే మొదటి సినిమా ఉంటుందని బాలయ్య ప్రకటించగానే అభిమానులు ఉప్పొంగిపోయారు. తమ అభిమాన హీరో నట వారసుడి సినిమా కోసం ఆశగా ఎదురుచూసారు గానీ ఫలితం లేకపోయింది. అప్పటి నుండి ఇప్పుడు అప్పుడు అంటూ ఊరిస్తూ ఎట్టకేలకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలయ్య దీనిపై మళ్లీ స్పందించారు.
 
తన తనయుడి సినిమా తప్పకుండా వచ్చే ఏడాది ఉంటుంది, ఇంకా కథ డిసైడ్ చేయలేదు. ఏదైనా మంచి కథ అనిపిస్తే ఆలస్యం చేయకుండా మొదలెట్టేయడమే అని బాలయ్య అన్నారు. 
 
మోక్షజ్ఞ ఇప్పటికే సినిమాలకు అవసరమైన డ్యాన్సులు, ఫైట్స్ వంటి అంశాలలో శిక్షణ పొందుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నందమూరి తారక రామారావు బయో పిక్‌లో రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు నేడు విడుదలైంది. ఇది ఎంత మాత్రం కలెక్షన్లు వసూలు చేస్తుందో చూడాలి మరి.