సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (11:33 IST)

భాగ్యశ్రీ బోర్స్ తో రొమాన్స్ చేస్తున్న మిస్టర్ బచ్చన్ పోస్టర్

RaviTeja, Bhagyashri Borse
RaviTeja, Bhagyashri Borse
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ కు వీరాభిమాని మాస్ మహారాజ రవితేజ. అతని శైలిని అనుకరిస్తూ డాన్స్ లోనూ తన శైలిని కలిపి చూపిస్తుంటాడు. ప్రస్తతుం ఆ పేరుతో సినిమా కూడా చేస్తున్నాడు. మిస్టర్ బచ్చన్ పేరుతో షూట్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రవితేజ యూత్ ఫుల్ క్యారెక్టర్ ను కూడా చేస్తున్నట్లు తెలిసింది. ఈరోజు వాలెంటైన్ డే సందర్భంగా యూత్ ఫుల్ పోస్టర్ ను విడుదలచేసి యూత్ కు ధీటుగా వున్నట్లు కనిపిస్తున్నాడు.
 
హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పనోరమా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ను అనౌన్స్ చేసినప్పటి నుండి సినిమా పై మంచి పాజిటివ్ బజ్ నెలకొంది. రవితేజ కుర్చీ లో కూర్చుని ఉండగా, రవితేజ పై హీరోయిన్ 
భాగ్యశ్రీ బోర్స్ వాలిపోయి ఉంది. ఈ రొమాంటిక్ పోస్టర్ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. 
 
మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.