శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (12:02 IST)

తప్పతాగి రచ్చ చేసిన టీవీ నటి... పోలీసులపై చేయి చేసుకోవడంతో...

సెలబ్రిటీలు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడినప్పుడు వారి తీరుపై విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో ముంబైకి చెందిన బుల్లితెర నటి మరియు మోడల్ ఫుల్లుగా మద్యం తాగి కారు నడపడంతో పాటుగా ఫుడ్ స్టోర్ సిబ్బందిపై దుర్భాషలాడటం, అడ్డొచ్చిన పోలీసులపై చేయి చేసుకోవడంతో ఆమెపై కేసులు నమోదు చేసారు. 
 
ముంబైలోని ఖార్ రోడ్డు మీదుగా సోమవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో తన స్నేహితులు రాహుల్, స్వప్నిల్‌తో కలిసి తప్పతాగిన రుహీ సింగ్ వాహనం నడుపుతూ వచ్చి, తినడానికి ఒక స్టోర్ వద్ద ఆపగా, అప్పటికే మూసేయడంతో సిబ్బంది ఆహారం ఇవ్వడానికి నిరాకరించారు.
 
దీంతో స్టోర్ యజమాని, సిబ్బందిని దుర్భాషలాడుతూ గొడవకు దిగగా వారు పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు గొడవను ఆపే ప్రయత్నం చేస్తుండగా పోలీసుల టీమ్‌‌పై దాడి చేసి, గాయపరిచారని పోలీసులు తెలిపారు. 
 
దాడి తర్వాత వేగంగా వెళ్లిపోవడానికి ప్రయత్నించి కారు నడిపి, మరో ఐదు కార్లను గుద్దేసింది. పోలీసులు వారి నుండి మెడికల్ శాంపిల్స్ తీసుకుని, వివిధ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి, అక్కడి నుండి పంపేసారు. మెడికల్ రిపోర్ట్‌లు వచ్చిన తర్వాత ఆమెపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.