శుక్రవారం, 21 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 13 అక్టోబరు 2023 (10:30 IST)

సినీ ప్రియులకు శుభవార్త : నేడు సినిమా టిక్కెట్ ధర రూ.90 మాత్రమే

multiplex
సినీ ప్రియులకు శుభవార్త. జాతీయ సినిమా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఒక్క రోజు మాత్రం సినిమా టిక్కెట్ ధర రూ.90గా నిర్ణయించారు. సాధారణంగా ఒక కుటుంబం సినిమా చూడాలంటే టిక్కెట్లు రూ.500 అవుతుంది. అదే మల్టీప్లెక్స్‌లలో అయితే, చెప్పనవరసం లేదు. కానీ, ఇపుడు మల్టీప్లెక్స్‌లలోనే రూ.99కే సినిమా చూడవచ్చు! అయితే ఎప్పటికీ కాదు.. శుక్రవారం ఒక్కరోజు మాత్రమే. 
 
ఈ శుక్రవారం ఈ బంపర్ ఆఫర్ లభిస్తోంది. జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా రూ.99కే టిక్కెట్‌ను విక్రయించనున్నట్టు చిత్ర ప్రదర్శనదారుల అసోసియేషన్ ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళలో మాత్రం ఈ ఆఫర్ వర్తించదు. 
 
తెలంగాణలోని మల్టీప్లెక్స్‌లలో రూ.112, కేరళ మల్టీప్లెక్స్‌లో రూ.129 విక్రయిస్తున్నారు. దేశంలోని చాలాచోట్ల రూ.99కే టిక్కెట్లు విక్రయిస్తున్నారు. అయితే రెగ్యులర్ ఫార్మాట్, నాన్ రెక్లయినర్ సీట్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. రేపు తెలుగు రాష్ట్రాల్లో పదికి పైగా సినిమాలు విడుదలవుతున్నాయి.