శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 ఏప్రియల్ 2020 (14:30 IST)

క్రాక్ నుంచి పోస్టర్ విడుదల.. శృతి, బాబుతో రవితేజ..

krack
రవితేజ, శృతిహాసన్ జంటగా నటిస్తున్న చిత్రం క్రాక్. ఈ సినిమా నుంచి శ్రీరామ నవమి సందర్బంగా మరో పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో నటుడు రవితేజ.. శృతి హాసన్‌తో పాటు ఒక బాబును ఎత్తుకుని ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇలాగే మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇంట్లోనే ఉండి ఎంజాయ్ చేయండి అనే సందేశంను చిత్ర యూనిట్ సభ్యులు ఇస్తున్నారు. 
 
టాలీవుడ్ మొత్తం కూడా కరోనాతో ఎఫెక్ట్ అయ్యింది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ అన్ని బంద్ అయ్యి సినిమాల విడుదల విషయంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి ఇలాంటి సమయంలో క్రాక్ సినిమా నుంచి పోస్టర్ రిలీజ్ కావడం మాస్ మహారాజ ఫ్యాన్సుకు పండగ చేసుకునేలా చేసింది. అయితే క్రాక్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది ప్రస్తుతం డౌటే. దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు.
 
ఇదిలా ఉంటే... కాగా ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించనుంది. ఇందులో 'జయమ్మ'గా వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తోంది. ఇప్పటికే ఆమె లుక్ విడుదలైంది. గ్రామీణ నేపథ్యంలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రనే పోషిస్తున్నట్టుగా అనిపిస్తోంది.