సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : శనివారం, 22 సెప్టెంబరు 2018 (17:10 IST)

ఎన్టీఆర్ బయోపిక్‌లో.. సావిత్రిలా నిత్యామీనన్..? కీర్తి సురేష్‌ను మరిపిస్తుందా?

క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ చాలా వేగంగా జరుపుతుంది. ఇది ఇలా ఉంటే చంద్రబాబు నాయుడిగా రానా, ఏఎన్నార్‌గా సుమంత్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమా టీమ్ శ్రీదేవి పాత్రకు రకుల్ ప్

క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడిగా రానా, ఏఎన్నార్‌గా సుమంత్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమా టీమ్ శ్రీదేవి పాత్రకు రకుల్ ప్రీత్‌ను తీసుకున్నట్లుగానే, సావిత్రి పాత్రకు నిత్యామీనన్‌ను తీసుకున్నట్లుగా సమాచారం.

  
అసలు విషయం చెప్పాలంటే మహానటి చిత్రంలోనే నిత్యామీనన్ సావిత్రిగా చేయవలసింది. కొన్ని కారణాల చేత చేయలేకపోయింది. కనుక ఇప్పుడు ఈ సినిమాలో సావిత్రిలా నటించనున్నారు. మాయాబజార్, మిస్సమ్మ, గుండమ్మ కథ, రక్త సంబంధం సినిమాలకు సంబంధించిన సీన్స్‌లో నిత్యా సావిత్రిలా కనిపించనున్నారు. 

త్వరలోనే నిత్యామీనన్ ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ కానున్నదని చెబుతున్నారు. అలానే ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానున్నది.