బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 3 నవంబరు 2023 (12:57 IST)

బాహుబలి సినిమాను పబ్లిసిటీగా వాడుకున్న నితిన్

Ntin publicy
Ntin publicy
నితిన్ తాజా సినిమా  ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ’. వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. ఈ చిత్రం డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలో ఈ చిత్ర టీజర్‌ను మూవీ టీం విడుదల చేసింది. నితిన్ ఫేస్ కు ఫేషియల్ చేసుకున్న వీడియో బయటకు వచ్చింది. అందులో తాను ఎక్స్‌ట్రా ఆర్డినరీ’ మేన్ అంటూ తండ్రి రావురమేష్ కు చెబుతాడు. పనిపాటా లేనివాడంటూ కాసేపు తిట్టి కాలితో దగ్గర వస్తువును కొట్టి కొడుకును తిడతాడు.
 
ఆ తర్వాత వీడియోలో యాక్షన్ సీన్స్ వుంటాయి. అప్పుడు అసలు నీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అని సంపత్ రాజ్ అడగడంతో.. బాహుబలి సినిమా చూశావా? అంటాడు. నాలుగుసార్లు చూశానంటాడు. అందులో ఆరో లైన్ లో ఏడో వ్యక్తి నేనే అంటాడు. అలాగే మరో సినిమా.. ఇలా చెబుతూ.. బాహుబలి లో గుంపులో సీన్ లో వున్నట్లు చూపించాడు.
 
ఇదంతా ఎందుకంటే.. ఎక్స్‌ట్రా ఆర్డినరీ చిత్రంలో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ గా నటించాడు. అందులో భాగంగానే ఇలా సరికొత్త ప్రచార జిమ్మిక్కును ఉపయోగించారని తెలుస్తోంది.