గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 30 మార్చి 2022 (12:50 IST)

నితిన్ మాచర్ల నియోజకవర్గం ఫస్ట్ ఎటాక్ (టీజర్) విడుద‌ల - జూలై 8న సినిమా రిలీజ్‌

Nitin Teaser Scene
యువ క‌థానాయ‌కుడు హీరో నితిన్  `మాచర్ల నియోజకవర్గం` చిత్రంలో గుంటూరు జిల్లా కలెక్టర్‌గా మొదటి బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ్ రెడ్డి అనే IAS అధికారి పాత్రను పోషిస్తున్నాడు. ఈ మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి MS రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి శ్రేష్ట్ మూవీస్‌పై సుధాకర్ రెడ్డి,  నికితారెడ్డి నిర్మిస్తున్నారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
 
ఈరోజు (బుధ‌వారంనాడు) నితిన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మేకర్స్ సినిమా ఫస్ట్ ఎటాక్ (టీజర్)ని విడుద‌ల చేశారు. 
టీజర్ ఎలా వుందంటే- సినిమా కథాంశం, ఇతర కంటెంట్ కనిపించలేదు, కానీ ఇది నితిన్ యాక్ష‌న్ సీన్‌ను అద్భుతంగా వెలివేట్ చేసింది. ముఖానికి పులి రంగు, ఒంటినిండా పులిచార‌లుతో వున్న కొంద‌రు దుండ‌గులు నితిన్‌పై కొడ‌వ‌ళ్ళ‌తో దాడిచేయ‌డం వారి నుంచి త‌ను త‌ప్పించుకోవ‌డం తిరిగి ఎదురు దాడి చేయ‌డం థ్రిల్‌గా అనిపిస్తుంది. అంద‌రిపై  ఎదురుదాడికి దిగి వారిని త‌రిమికొట్టే విధానం ఆక‌ట్టుకుంది. ఆ క్ర‌మంలో కొంద‌రిని ఎటాక్‌చేసి ష‌డెన్‌గా కూర్చుని మిగిలిన‌వారి రాక గ‌మ‌నిస్తూ చూసిన లుక్ అదిరిపాటుగా వుంది. ఈ టీజ‌ర్ సినిమాలో తీవ్రమైన యాక్షన్ బ్లాక్‌ని చూపుతుంది. వెంకట్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన యాక్షన్ సీక్వెన్స్ నితిన్ మాస్‌, యాక్షన్ వైపు చూపిస్తూ అద్భుతంగా డిజైన్ చేశారు.
 
నితిన్ ఈ పాత్రలో చాలా అద్భుతంగా ఉన్నాడు. పూర్తి మీసాలు, చిన్న‌పాటి గడ్డం గెటప్‌తో మాస్‌గా కనిపించాడు. టీజర్‌ను బట్టి చూస్తే, సినిమాలో కొన్ని హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయి. ప్రసాద్ మూరెళ్ల కెమెరా పనితనం అత్యున్నతంగా క‌నిపిస్తుంది. మహతి స్వర సాగర్ తన అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో వీడియోకి ఇంటెన్స్ క్రియేట్ చేసింది.
 
టీజర్‌లో చెప్పిన‌ట్లుగా, మాచర్ల నియోజకవర్గం జులై 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.
పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రాజకీయ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
 
మామిడాల తిరుపతి డైలాగ్స్ అందించగా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌.
 
నటీనటులు: నితిన్, కేథరిన్ ట్రెసా, కృతి శెట్టి తదితరులు
 
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: MS రాజ శేఖర్ రెడ్డి
నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి
బ్యానర్: శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్
స‌మ‌ర్ప‌ణ - రాజ్‌కుమార్ ఆకెళ్ల
సంగీతం: మహతి స్వర సాగర్
DOP: ప్రసాద్ మూరెళ్ల
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
లైన్ ప్రొడ్యూసర్: జి హరి
సంభాషణలు: మామిడాల తిరుపతి
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
ఫైట్స్: వెంకట్
PRO: వంశీ-శేఖర్