సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 30 నవంబరు 2017 (10:38 IST)

విజయ్ సేతుపతి చిత్రంలో నిహారిక.. లుక్ అదిరింది (వీడియో)

మెగా హీరోయిన్‌ నిహారిక తమిళంలో బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఈ సినిమాలో నిహారిక స్టార్ హీరో విజయ్ సేతుపతితో కలిసి నటిస్తున్నట్లు సమాచారం. అయితే గౌతమ్ కార్తీక్‌కు జోడీగా ఈమె నటిస్తుంది. ఇందులో విజయ్ సేతుపతి

మెగా హీరోయిన్‌ నిహారిక తమిళంలో బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఈ సినిమాలో నిహారిక స్టార్ హీరో విజయ్ సేతుపతితో కలిసి నటిస్తున్నట్లు సమాచారం. అయితే గౌతమ్ కార్తీక్‌కు జోడీగా ఈమె నటిస్తుంది. ఇందులో విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపిస్తాడు. ''ఒరు నల్లనాల్ పాతు సొల్రేన్‌" అనే టైటిల్ ఈ సినిమా ఖరారు చేశారు. ఈ సినిమా టీజర్ విడుదలైంది. 
 
ఇప్పటికే ఈ టీజర్‌ను 2లక్షలకు పైగా అభిమానులు వీక్షించారు. సోషల్ మీడియాలో ఈ సినిమా టీజర్ వైరల్ అవుతోంది.  సినిమాలో అభినయానికి ప్రాధాన్యమున్న పాత్రను ఆమె దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఉదయం టీజర్ విడుదల కాగా, ఇప్పటికే దీనిని 2 లక్షలకు పైగా అభిమానులు వీక్షించారు. 
 
విజయ్ సేతుపతి, గౌతమ్ కార్తీక్, జస్టిన్ ప్రభాకర్ తదితరులు నటిస్తున్న ఈ  చిత్రంలో రెండు వెరైటీ పాత్రల్లో నిహారిక నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిహారిక లుక్ కూడా అదిరిపోయింది. టీజర్‌ను ఓ లుక్కేయండి.