శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 23 నవంబరు 2017 (13:40 IST)

ఎలాంటి కట్స్ లేకుండా పద్మావతి రిలీజ్.. ఎక్కడ?

సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన చిత్రం "పద్మావతి". దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్ నటించిన ఈ చిత్రం తీవ్ర వివాదంలో చిక్కుకున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో రాణి 'పద్మావతి' ఢిల్లీ సుల్తాన్

సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన చిత్రం "పద్మావతి". దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్ నటించిన ఈ చిత్రం తీవ్ర వివాదంలో చిక్కుకున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో రాణి 'పద్మావతి' ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీతో రాసలీలలు జరిపినట్టు చిత్రీకరించారు. వీటిని రాజ్‌పుత్‌ కర్ణిసేన వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అలాగే కొన్ని రాష్ట్రప్రభుత్వాలు కూడా ఈ చిత్రం విడుదలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ఈ చిత్రం విడుదలను వాయిదా వేశారు. 
 
ఈనేపథ్యంలో పద్మావతి సినిమాను యధావిధిగా విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. డిసెంబర్ ఒకటో తేదీన.. ఎలాంటి కట్స్ లేకుండా విడుదల చేస్తామని తెలిపింది. అయితే ఇది భారత్‌లో మాత్రం కాదు. లండన్‌లో. బ్రిటీష్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్స్ సర్టిఫికేషన్ నుంచి అనుమతి వచ్చిందని.. మన దేశంలో కంటే ముందే అక్కడ విడుదల చేస్తున్నట్లు డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ వెల్లడించారు. పద్మావతి మూవీకి బ్రిటీష్ సెన్సార్ బోర్డ్ 12ఏ సర్టిఫికెట్ మంజూరు చేస్తూ తన వెబ్‌సైట్ స్పష్టం చేసింది. సినిమా నిడివి 163 నిమిషాల 42 సెకన్లు. అంటే 2 గంటల 43 నిమిషాలుగా ఉంది.