సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 19 సెప్టెంబరు 2018 (17:37 IST)

చిమ్మటి చీకటి.. కమ్మటి సంగటి... గుండెల్ని పిండేసే 'పెనివిటి' సాంగ్

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "అరవింద సేమత వీరరాఘవ''. ఈ చిత్రంలోని పాటల్లో తొలి పాటను ఇప్పటికే విడుదలచేయగా అది అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. బుధవారం రెండోపాటను వి

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "అరవింద సేమత వీరరాఘవ''. ఈ చిత్రంలోని పాటల్లో తొలి పాటను ఇప్పటికే విడుదలచేయగా అది అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. బుధవారం రెండోపాటను విడుదల చేశారు.
 
గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి రాసిన 'పెనివిటి' పాటను రిలీజ్ చేశారు. ఈ రెండో పాట గుండెల్ని పిండేస్తోంది. ఈ సాంగ్ విన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా కంటతడి పెట్టుకోవాల్సిందే. 
 
ఎన్టీఆర్ సరసన పూజ హెగ్డే నటించగా ఈ సినిమాకు ఎస్.ఎస్. థమన్ సంగీతబాణీలు సమకూర్చారు. ఈ చిత్రం ఆడియో ఈనెల 20వ తేదీన విడుదల కానుండగా, దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు అరవిందుడు రానున్నారు. 
 
కాగా, ఈ పెనివిటి సాంగ్ గురించి రామజోగయ్య శాస్త్రి స్పందిస్తూ, ఈ పాట పదికాలాలపాటు గుర్తుండిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మంచి సిట్యుయేషన్ దొరికితే.. అద్భుతమైన లిరిక్స్ అందించవచ్చని ఈ సాంగ్ ద్వారా మరోసారి రుజువైందని చెప్పుకొచ్చాడు.