సోమవారం, 14 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (20:39 IST)

తండ్రితో లిప్ లాక్.. అప్పట్లో సంచలనం.. ఇప్పుడెందుకు రచ్చ..?

Pooja Bhatt
Pooja Bhatt
బాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో మహేష్ భట్ ఒకరు. హిందీ సినిమా ఇండస్ట్రీకి పెద్దగా పరిచయం చేయనక్కర్లేని పేరు మహేష్ భట్‌ది. మహేష్ భట్ తెలుగు ప్రేక్షకులకు ఆర్ఆర్ఆర్ బ్యూటీ అలియా భట్ తండ్రిగా పరిచయం అయ్యాడు. మహేష్ మొదటి భార్య కూతురు పూజా భట్ హీరోయిన్‌గా మొదట్లో విపరీతమైన క్రేజ్ అందుకుంది. 
 
అయితే దాదాపు 33 ఏళ్ల క్రితం ఓ మ్యాగజైన్ ఫోటో షూట్ కోసం మహేష్ భట్ కూతురు పూజతో లిప్ లాక్ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. తండ్రీకూతుళ్లు అలా లిప్ కిస్ ఎందుకు ఇస్తారని పలు విమర్శలు వచ్చాయి. 
 
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పూజా భట్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
పూజా భట్ మాట్లాడుతూ.. "అది చాలా సాధారణ విషయం. కానీ, కొందరు ఆ ఫొటోలకు భిన్నంగా వ్యాఖ్యానించడం దురదృష్టకరం. మా నాన్నతో లిప్ కిస్‌పై అప్పట్లో నన్ను చాలామంది విమర్శించారు. షారుక్‌ ఖాన్‌ మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. చిన్నతనంలో తల్లిదండ్రులు పిల్లలకు ఇలా ముద్దులు పెడతారు.
 
పిల్లలు ఎంత పెద్దవారైనా తల్లిదండ్రులు ముద్దులు పెట్టుకుంటారు. వారిని చిన్నపిల్లల్లా చూసుకుంటానని షారుక్ నాతో చెప్పాడు. నిజం చెప్పాలంటే, మా నాన్న ఇప్పటికీ నన్ను చిన్నపిల్లలా చూస్తారు. ఆ ఫోటో షూట్ చేసినప్పుడు నాకు సమాజం గురించి పెద్దగా అవగాహన లేదు. సబ్జెక్ట్ ఏదయినా జనాలు వారికి నచ్చినట్లు చూస్తారు. 
 
తండ్రీకూతుళ్ల మధ్య సంబంధమేంటని ప్రశ్నించేవాళ్లు దేన్నైనా ఊహించగలరు. వారు ఎలాంటి కామెంట్స్ అయినా చేయవచ్చు. అలాంటి వ్యక్తులు మళ్లీ కుటుంబ విలువల గురించి మాట్లాడటం పెద్ద జోక్‌" అని పూజా భట్ తన తండ్రితో లిప్ లాక్‌పై స్పందించింది.