ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 మార్చి 2022 (17:00 IST)

ప్రభాస్‌‌తో గొడవలా.. అతనో స్వీట్ పర్సన్.. బుట్టబొమ్మ

బుట్టబొమ్మతో ప్రభాస్‌కు గొడవలని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వచ్చింది. వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్ ఇంకో వారంలో విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ప్రమోషనలలో బిజీగా ఉన్న చిత్ర బృందం సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఇక ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ తో గొడవపై పూజా నోరు విప్పింది.
 
పూజా హెగ్డే మాట్లాడుతూ.. ప్రభాస్ చాలా స్వీట్ పర్సన్.. ఆయనతో కలిసి నటించడం నా అదృష్టం.. ఆయనతో కలిసి పనిచేసిన రోజులన్నీ అద్భుతం.. ఈ పుకార్లలో నిజం లేదు.

నిజానికి అతను నాకు మా అమ్మకు కూడా ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని పంపాడు. ఇలాంటి ఆధారాలు లేని వార్తలను ప్రచారం చేయడం ఆపండి" అంటూ చెప్పుకొచ్చింది. ఇకపోతే.. మార్చి 11న రాధేశ్యామ్ విడుదల కానుంది.