ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 29 మే 2023 (19:34 IST)

31న మహేష్ - త్రివిక్రమ్ కొత్త చిత్రం అప్‌డేట్... టైటిల్ ఇదేనా?

mahesh babu
టాలీవుడ్ హీరో మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతుంది. ఇది మహేశ్ బాబు నటించే 28వ చిత్రం. ఈ చిత్రం టైటిల్‌ను ఈ నెల 31వ తేదీన అధికారికంగా వెల్లడికానుంది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబుకు సంబంధించిన ఓ పవర్ ఫుల్ పిక్‌ను విడుదల చేసింది. ఫుల్ మాస్‌ గెటప్‌లో ఉన్న మహేశ్ బాబు నేలతల్లికి వందనం చేస్తుండటం ఆ ఫోటోలో చూడొచ్చు. 
 
మరో రెండు రోజుల్లో ఎస్ఎస్ఎంబీ 28 నంచి మాస్ ధమాకా వచ్చేస్తుందని చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వెల్లడించింది. మహేశ్ బాబు వీరాభిమానులు ఈ చిత్రం టైటిల్‌ను సినిమా థియేటర్లలో రిలీజ్ చేస్తారని వివరించింది. 
 
కాగా, ఈ మూవీలో మహేశ్ సరసన పూజా హెగ్డే, శ్రీలీలలు నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. అతడు, ఖలేజీ చిత్రాల తర్వాత మహేశ్ - త్రివిక్రమ్ కలయికతో వస్తున్న ఈ చిత్రానికి "గుంటూరు మిర్చి" అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.