మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 ఏప్రియల్ 2021 (12:26 IST)

'పుష్ప' చిత్రం ప్రీలూడ్ రిలీజ్.. బన్నీ ఫ్యాన్స్‌కు ట్రీట్ (video)

Allu Arjun
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న 'పుష్ప' చిత్రం ప్రీలూడ్ విడుదలైంది. కనీకనపడని బన్నీ అడవుల్లో పరిగెడుతున్న విజువల్ ఫ్యాన్స్‌కు తెగ నచ్చేస్తోంది. ఇక ఈ నెల 7న పుష్పరాజ్ పాత్రను పరిచయం చేస్తామని ఈ ప్రీలూడ్‌లో ప్రకటించేశారు మేకర్స్. దీంతో బన్నీ ఫ్యాన్స్ అనందానికి అవధుల్లేవ్. 
 
చిన్న ప్రీలూడ్ తోనే కేక పెట్టించిన బన్నీ ఇక పాత్ర పరిచయంలో ఎలా రెచ్చిపోతాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రశ్మిక ఇందులో హీరోయిన్. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ ఇందులో బన్నీకి విలన్‌గా నటిస్తుండగా జగపతిబాబు, ప్రకాశ్ రాజ్ ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.