గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 26 మే 2021 (17:15 IST)

ఇండియాలోనే ఆర్‌.ఆర్‌.ఆర్‌. అతి పెద్ద డీల్ అన్నపెన్ మూవీస్‌

RRR Big deal
ఎన్‌.టి.ఆర్‌., రామ్‌చ‌ర‌ణ్‌, కాంబినేష‌న్‌లో రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమా `ఆర్‌.ఆర్‌.ఆర్‌.`. ఈ సినిమా ఐదు భాష‌ల‌కు చెందిన ఎల‌క్ట్రానిక్‌, డిజిట‌ల్, శాటిలైట్‌ హ‌క్కులను పెన్ స్టూడియోస్ అధినేత జ‌యంతీలాల్ గ‌డా స్వాధీనం చేసుకున్నార‌నేది వెబ్‌దునియా పాఠ‌కుల‌కు తెలిసిందే. దీన్ని ధృవీక‌రిస్తూ బుధ‌వారంనాడు పెన్ మూవీస్ అధికార ప్ర‌క‌ట‌న విడుద‌ల  చేసింది.ఇప్పటివరకు సినిమా విడుద‌ల‌కు ముందు ఏ భారతీయ చిత్రానికి జ‌ర‌గ‌ని అతిపెద్ద డీల్ అంటూ పోస్ట్ చేసింది ఆ సంస్థ‌. ఎంత మొత్తానికి కొన్న‌ది అనేది వెలువ‌రించ‌లేదు.
 
ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమాకు డి.వి.వి. దాన‌య్య నిర్మాత‌. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తికాలేదు. రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్‌.టి.ఆర్‌. న‌టిస్తున్న ఈ సినిమాలో కొమ‌రం భీమ్ పాత్ర కొత్త స్టిల్‌ను ఆయ‌న పుట్టిన‌రోజైన ఈనెల 20న రాజ‌మౌళి విడుద‌ల చేశాడు. అది ఫ్యాన్స్‌ను బాగా ఆక‌ట్టుకుంది. కాల్ప‌నిక క‌థ‌తో రూపొందుతోన్న ఈ సినిమా ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఆర్‌.ఆర్‌.ఆర్‌.కు చెందిన అన్నిభాష‌ల‌కు ఇందుకు 475 కోట్ల డీల్ కుదుర్చుకున్న‌ట్లు తెలుస్తోంది. ఆ సంస్థ నుంచి జీ గ్రూప్ కూడా కొంత మేర‌కు హ‌క్కుల‌ను చేజిక్కించుకున్న‌ద‌ని స‌మాచారం.